తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్లుగా ఇళ్ల మధ్యే మురికి కాలువ - drinage problems

స్వచ్ఛ భారత్​ అంటూ ప్రభుత్వం ఊదరగొడతున్నా కొన్నిచోట్ల అపరిశుభ్రత తాండవం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎర్రగుంటలోని ఒవైసీ కాలనీలో ఇళ్ల మధ్యే మురికినీరు నిల్వ ఉండడం వల్ల స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు.

మురికి కాలువ

By

Published : Aug 22, 2019, 1:39 PM IST

ఇళ్ల మధ్యే మురికి కాలువ...

రంగారెడ్డి జిల్లా ఎర్రగుంటలోని ఒవైసీ కాలనీలో రెండేళ్ల నుంచి డ్రైనేజీ సమస్య ఉంది. కనీసం నడవడానికి కూడా దారి లేదు. ఇళ్ల ముందు మురికి నీరు భారీగా నిల్వ ఉండడం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు కాలనీ వదిలేసి వెళ్తున్నారు. ఈ సమస్యపై జలపల్లి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు.

శంకుస్థాపన చేసినా

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గత నెలలో పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదని, అధికారులను, ఎమ్మెల్యేను ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తొలి రఫేల్​ యుద్ధ విమానానికై ఫ్రాన్స్​కు రక్షణమంత్రి

ABOUT THE AUTHOR

...view details