VRA Protest:ఉద్యోగ క్రమబద్ధీకరణ, పేస్కేలు వర్తింపు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ ఎమార్వో వినతిపత్రం ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.
రాష్ట్రంలో 22 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు ఉన్నారని రాజయ్య చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తామని, పేస్కేలు వర్తింపజేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. వీఆర్‌ఏల కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారన్నారు. ఈ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం గత 20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి.. సమస్యలను పరిష్కరించాలని రాజయ్య డిమాండ్ చేశారు.