తెలంగాణ

telangana

ETV Bharat / state

dgp: 'జప్తు చేసిన వాహనాలను కోర్టు నుంచే తెచ్చుకోవాలి' - చెక్​పోస్టుల పరిశీలన

రాష్ట్రంలో ప్రజల సహకారంతోనే లాక్​డౌన్(Lock down)​ పటిష్టంగా అమలు జరుగుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి (dgp mahender reddy) అన్నారు. విజయవాడ జాతీయ రహదారిపై చెక్​పోస్టులని రాచకొండ సీపీ మహేష్ భగవత్​(rachakonda cp mahesh bhagwat)తో కలిసి ఆయన పరిశీలించారు.

dgp mahender reddy visit check posts
dgp mahender reddy: చెక్​పోస్టుల తనిఖీ

By

Published : May 28, 2021, 3:25 PM IST

విజయవాడ జాతీయ రహదారిపై చెక్​పోస్టులని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్​తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్​పేట్, కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల వద్ద సిబ్బంది పనితీరును పరిశీలించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​(Lock down) పటిష్టంగా అమలవుతుందని డీజీపీ పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24/7 కష్టపడి లాక్​డౌన్​(Lock down) ను కఠినంగా అమలు చేస్తున్నారని అభినందించారు.

ఎవరైనా రూల్స్ అతిక్రమించి బయటకు వస్తే వారి వాహనాలు జప్తు చేస్తామని… వాటిని లాక్​డౌన్(Lock down) అనంతరం కోర్ట్ నుంచి తీసుకోవాలని సూచించారు. కాలనీల్లో కూడా యువకులు, పిల్లలు బయటకు వచ్చిక్రికెట్ ఆడకూడదని కాలనీ అసోసియేషన్లకు అవగాహన కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details