రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రమేశ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ కారును ఆపేందుకు యత్నించగా.. కారు నడుపుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అతన్ని ఢీకొట్టాడు.
DGP: చికిత్స పొందుతున్న హోంగార్డును పరామర్శించిన డీజీపీ - హోంగార్డు రమేశ్‌ను పరామర్శించిన డీజీపీ
సాఫ్ట్ వేర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న హోంగార్డు రమేశ్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి వెళ్లిన డీజీపీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
హోంగార్డు రమేశ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి
తీవ్ర గాయాల పాలైన రమేశ్‌ను కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. రమేశ్‌కు మరింత మెరుగైన వైద్య చికిత్స అందించాలని డీజీపీ మహేందర్ రెడ్డి వైద్యులను కోరారు.