నగర శివారు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాల కూల్చివేతతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సర్వే నంబర్ 156/1 లో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది స్థానికులు అక్రమంగా 25 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు హెచ్చరించిన రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారు. పోలీస్ బలగాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో ఆగ్రహించిన సదరు స్థానికులు జేసీబీ వాహనాలను ధ్వంసం చేశారు.
అద్దాలు పగులగొట్టి , అధికారులను పరుషజాలంతో మాట్లాడి హంగామా సృష్టించారు. ఆపై రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.