తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం - DEMOLITION IN HYDERABAD

అనుమతుల్లేంకుండా... నిర్మించిన కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత స్పెషల్​డ్రైవ్​లో భాగంగా... రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను కూల్చివేశారు.

DEMOLITION AT SHAMSHABAD
DEMOLITION AT SHAMSHABAD

By

Published : Feb 12, 2020, 2:09 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం చేపట్టింది. స్పెషల్ డ్రైవ్​లో భాగంగా శంషాబాద్​లోని సర్వీస్ రోడ్, సామ ఎన్​క్లేవ్, ఇన్​ఫాంట్ జీసెస్ స్కూల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. అనుమతుల్లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా... కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓ ఉన్నందున ప్లాట్లు కొనుగోలు చేసేముందు హెచ్ఎండీఏలో విచారించాలని అధికారులు సూచించారు.

అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

ఇదీ చూడండి:అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్తే.. రాళ్లతో దాడి

ABOUT THE AUTHOR

...view details