షాద్నగర్ పట్టణ శివారులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో డీసీఎం దగ్ధమైంది. కల్వకుర్తి ప్రాంతం నుంచి కొత్తూరు పారిశ్రామిక ప్రాంతానికి అట్టలతో వస్తున్న డీసీఎంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. డ్రైవర్ శివకుమార్ వాహనం నుంచి దిగి దూరంగా పరిగెత్తాడు. క్షణాల్లో మంటలు వాహనం అంతా వ్యాపించి మొత్తం కాలిపోయింది. ఇంజన్ విపరీతమైనా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
షాద్నగర్లో డీసీఎం దగ్ధం - షాద్నగర్లో డీసీఎం దగ్ధం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శివారులో డీసీఎం దగ్ధమైంది. ఇంజను వేడెక్కడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
షాద్నగర్లో డీసీఎం దగ్ధం