కరోనా(corona) విపత్కర పరిస్థితుల్లోనూ... సైబర్(cyber) నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొవిడ్(covid) సేవల పేరుతో అమాయకులను నమ్మించి డబ్బులు లాగేస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల పేరుతో రూ.20లక్షలను కాజేసినట్లు బాధితులు వాపోయారు. ఐసీయూలో బెడ్‌లు ఇప్పిస్తామని వల విసురుతున్నారు. ప్రాణధార ఔషధాల పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాక్సిన్ వేయిస్తామంటూ మోసాలకు తెరతీస్తున్నారు. ఇంటి నుంచే పని అంటూ ఉద్యోగ ప్రకటనలతో టోపీ పెడుతున్నారు.
Cyber crimes: అప్రమత్తతోనే.. సైబర్ మోసాలకు అడ్డుకట్ట
కొవిడ్(covid) ఆపత్కాలంలోనూ సైబర్(cyber) నేరగాళ్ల ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా(corona) సేవల పేరుతో అమాయకులకు వల వేస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వ్యాక్సిన్, ఐసీయూలో పడకలు అంటూ కొత్త తరహా మోసాలకు తెర లేపారు. అప్రమత్తతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్టవేయగలమని అధికారులు చెబుతున్నారు.
దిల్లీ, రాజస్థాన్ నుంచి సైబర్ మోసగాళ్లు వల వేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. సైబర్ మోసాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నగదు లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వేళ సైబర్ కేటుగాళ్లు ఏయే తరహా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాలపై సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత