రేపటి నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ దుకాణం వద్దకు భారీగా వచ్చిన ప్రజలు.. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు.
ఇబ్రహీంపట్నంలో మద్యం కోసం బారులు తీరిన ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం వల్ల మద్యం దుకాణాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. దుకాణదారులు, కొనుగోలుదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పలువురు హెచ్చరించారు.
croud at wine shops, ibrahimpatnam
మందుబాబులు మొదట్లో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ఎగబడ్డారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకోగానే.. క్యూలో నిలబడి, దూరం పాటిస్తూ మద్యం తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: మద్యం దుకాణాలు ఉదయం 10లోపు తెరిచే అవకాశం లేదు: ఆబ్కారీశాఖ