రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. గ్రామాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులు, కుంటలు నిండుకుండాలను తలపిస్తున్నాయి.
ఎడతెరపిలేని వర్షం.. ఎనలేని నష్టం... - ఇబ్రహీంపట్నం వార్తలు
రాష్ట్రంలో విస్తరంగా కురిసిన వర్షాలు... చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోగా... మరోవైపు పంటలు నీటమునిగి రైతన్నకు నష్టాలు మిగిల్చాయి. రంగారెడ్డి జిల్లాలో సైతం వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల పంటలు నీటమునిగాయి.
crops effected to heavy rains in rangareddy
పలు చోట్ల చెరువులు అలుగులు పారుతున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల పత్తి, వరితో పాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. చేతికందే సమయంలో నీటమునిగిన పంటలను చూసిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.