రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలోని నందిహిల్స్లో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్(సీఏపీ)ను క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రారంభించారు. అకాడమీని ప్రారంభించడం ఆనందంగా ఉందని, యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయి శిక్షణను సీఏపీ అందించనుందని యూసఫ్ పేర్కొన్నారు.
నందిహిల్స్లో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన యూసఫ్ - cricket yusuf pathan inaugurated cricket academy of pathans in nandi hills
మీర్పేట్ పరిధిలోని నందిహిల్స్లో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ను క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రారంభించారు. ఔత్సాహికులకు ఈ అకాడమీ ప్రపంచ స్థాయి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
![నందిహిల్స్లో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన యూసఫ్ cricket academy of pathans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10753407-350-10753407-1614139115305.jpg)
క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్
అత్యుత్తమ శ్రేణి బౌలింగ్, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికతతో క్రీడాకారులు ప్రయోజనం పొందగలరని యూసఫ్ ధీమా వ్యక్తం చేశారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారికి మెళకువలు నేర్పాలనే లక్ష్యంతో క్రికెట్ అకాడమీని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించినట్లు చెప్పారు.
సీఏపీతో ప్రపంచ స్థాయి శిక్షణ: యూసఫ్ పఠాన్
ఇదీ చదవండి:పెట్రోల్ ఎఫెక్ట్: వీలైతే వాకింగ్... లేదంటే సైక్లింగ్...