రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ కార్యకర్త బోయపల్లి కమలమ్మ మృతి చెందారు. ఆమె భర్త కీ.శే కామ్రేడ్ బోయపల్లి ముత్తయ్య తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటంలో కీలక పాత్ర పోషించారు. భూస్వాములపై తిరుగుబాటు సమయంలో భర్తకు అండగా ఉన్న కమలమ్మ.. చివరికి వరకు కమ్యూనిస్టు పార్టీలోనే ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఉదయం తుది శ్వాస విడిచారు.
సీపీఎం పార్టీ సభ్యురాలు కమలమ్మ మృతి.. నేతల సంతాపం - telangana news
మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సభ్యురాలు బోయపల్లి కమలమ్మ మృతి చెందారు. ఆమె మృతిపట్ల పార్టీ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
సీపీఎం
ఆమె మృతి పట్ల సీపీఎం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కమలమ్మ మరణం పార్టీకి తీరని లోటన్నారు. అంతిమ యాత్రలో గ్రామ కార్యదర్శి ముక్కం వెంకటయ్య, జంగయ్య, ఈరమల్ల వెంకటయ్య, చెరుకు గణేశ్, గంపెల్లి రాజు, డీవైఎఫ్ నాయకులు యస్. రాజుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి
Last Updated : Sep 10, 2021, 8:59 PM IST