D.RAJA COMMENTS ON BJP: భాజపా, ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగిన సీపీఐ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని.. ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని డి.రాజా ఆకాంక్షించారు. మిగతా ప్రాంతీయ పార్టీలు, లౌకికవాద శక్తులు కలిసి రావాలని ఆయన కోరారు.
ఈ క్రమంలోనే భాజపా, ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని డి.రాజా పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు 2024 ఎన్నికలు చాలా కీలకమైనవని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలు 2024లో ఉమ్మడిగా పోరాటం చేసి భాజపాను గద్దెదింపుదామని కోరుతున్నామన్నారు.
భాజపా విధానాలను విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ పోరాట పంథాను కొనసాగించాలి. దేశ భవిష్యత్తుకు 2024 ఎన్నికలు చాలా కీలకమైనవి. భాజపా, ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం సురక్షితంగా లేదు. దేశ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2024లో ఉమ్మడిగా పోరాటం చేసి భాజపాను గద్దెదింపుదామని కోరుతున్నాం. - డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి