దేశంలో లౌకికవాదాన్ని అణచివేసేందుకు భాజపా కుట్ర చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో చండ్ర రాజేశ్వరరావు 27వ వర్ధంతి నిర్వహించగా... ఆయన పాల్గొని నివాళులు అర్పించారు.
లౌకికవాదాన్ని అణచివేసేందుకు భాజపా కుట్ర: సీపీఐ నారాయణ - తెలంగాణ వార్తలు
చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. దేశంలో లౌకికవాదాన్ని అణచివేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు.
చండ్ర రాజేశ్వర్‌కు సీపీఐ నారాయణ నివాళి, పీఎం మోదీపై సీపీఐ నారాయణ ఆగ్రహం
ప్రపంచ కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న చండ్ర రాజేశ్వరరావు దేశంలో లౌకికవాదం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దేశంలో కశ్మీరీ, అసోం రాష్ట్రాల్లో వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని అన్నారు. భాజపాకి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని సూచించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 2,478 కరోనా కేసులు.. 5 మరణాలు