తెలంగాణ

telangana

ETV Bharat / state

CPI Mahasabha: 'ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం'

CPI Mahasabha: ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పురపాలికలో నిర్వహించిన ప్రథమ మహాసభలకు ఆయన హాజరయ్యారు.

By

Published : Jun 29, 2022, 3:52 PM IST

CPI Mahasabha:
CPI Mahasabha:

CPI Mahasabha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పేదరికం బాగా పెరిగిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆరోపించారు. కరోనా తర్వాత దేశంలో ధనికులు మరింత ధనికులుగా.. పేదలు మరింత పేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పురపాలికలో జరిగిన సీపీఐ ప్రథమ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో ప్రజలను విడదీస్తున్నారని జంగయ్య మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించడానికి సీపీఐ తరఫును ప్రజా పోరాటాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. మహసభలో ముఖ్యమైన ప్రజా సమస్యలపైన తీర్మానాలు చేశారు. అనంతరం తుర్కయాంజల్ పురపాలిక నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా గునుగంటి క్రాంతి కుమార్, సహాయ కార్యదర్శులుగా పి. శివ కుమార్, దనవత్ భారత్ నాయక్, కార్యవర్గ సభ్యులుగా గువ్వల రాజు, ఈదులకంటి అనురాధ, వట్టి విజయ, పల్లపు శివ కుమార్, కాటం రాజు, సుందరమ్మ, కొండిగారి శివ కుమార్​లతో పాటు 21 మందితో నూతన కౌన్సిల్​ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, పానుగంటి పర్వతాలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details