శంషాబాద్ ఘటన బాధిత కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పరామర్శించారు. నేతలు రావొద్దంటూ గేటెడ్ కమ్యూనిటీ గేటుకు కాలనీవాసులు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని చాడ విమర్శించారు.
'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే' - మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే
రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతున్నా... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పట్ల సీపీఐ నేతలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను రక్షణ కోసం ఉపయోగించాలే తప్ప ఉద్యమాలను అణచివేసేందుకు కాదని విమర్శించారు.
'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే'
నిఘా, ఇంటలిజెన్స్ విభాగాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. అత్యాచార కేసు నిందితులను శిక్షించేందుకు నిర్భయ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన పట్ల ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం విచారకరమని వెల్లడించారు.
ఇవీచూడండి:పరామర్శలు వద్దు న్యాయం కావాలి...
TAGGED:
ప్రియాంక హత్యపై చాడ స్పందన