కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ బిల్లులు రైతు వ్యతిరేకమని ధ్వజమెత్తాయి. వీటిని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి నిరసన తెలిపాయి.
వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం: వామపక్షాలు - తెలంగాణ తాజా వార్తలు
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని వామపక్షాలు ఆరోపించాయి. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంఘాలతో కలిసి నిరసన తెలిపాయి.
వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం: వామపక్షాలు
వామపక్షాల నాయకులు ఈ బిల్లు ప్రతిని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాం చందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యులు సమేల్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కావాలి నర్సింహ, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గ్రామాల్లో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాంః వీహెచ్