హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లకు తాము అండగా ఉన్నామంటూ సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చారు. దాదాపు 145 మంది ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీపీ - తెలంగాణ వార్తలు
కరోనా వేళ సైబరాబాద్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
![ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీపీ CP sajjanar distributed essentials to transgender, cyberabad cp sajjanar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:25:56:1621731356-tg-hyd-83-22-cyb-cpgroceries-distribution-av-ts10002-22052021230050-2205f-1621704650-268.jpg)
ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరకులు సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ
ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌ను ప్రపంచంలో తొలిసారిగా సైబరాబాద్‌లో ఏర్పాటు చేశామని సీపీ అన్నారు. ఈ డెస్క్ ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీ, మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా సోకిన వారు గుండెపోటుతో మరణించడానికి కారణమదే!