పశువైద్యురాలి హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. బుధవారం రాత్రి యువతి కిడ్నాప్‌కు గురైనట్లు తెలిపారు. కొల్లూరులో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేస్తోందని సీపీ పేర్కొన్నారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికినట్లు వివరించారు. తెలిసినవారు చేశారా? లేదా లారీ వాళ్ల పనా? అనే కోణంలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో ప్రయాణించిన అన్ని వాహనాల వివరాలు తీసుకుంటున్నామన్నారు.
షాద్‌నగర్ హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు - ప్రియాంకరెడ్డి హత్యకేసుపై సీపీ
బుధవారం రాత్రి హత్యకు గురైన పశువైద్యారాలి కేసు దర్యాప్తునకు 10 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
![షాద్‌నగర్ హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు cp-sajjanar-about-shadnagr_murder-case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5204715-thumbnail-3x2-df.jpg)
cp-sajjanar-about-shadnagr_murder-case
Last Updated : Nov 29, 2019, 3:27 PM IST