ప్రశాంత వాతావరణంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్, ఇండోర్ స్టేడియం, హయత్ నగర్ వర్డ్ & డీడ్ స్కూల్, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, నాచారం శ్రీచైతన్య హైస్కూల్లో లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను మహేష్ భగవత్ పరిశీలించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు: సీపీ - Rachakonda Police Commissioner Mahesh Bhagwat
జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిందేకు తగిన ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ తరుణంలో సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్, ఇండోర్ స్టేడియం, హయత్ నగర్ వర్డ్ & డీడ్ స్కూల్, తదితర ప్రాంతాల్లోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు: సీపీ
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పోలింగ్, లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ అన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం ముగుస్తుందని.. ఎన్నికల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవాలని మహేశ్ భగవత్ సూచించారు.
ఇదీ చూడండి:ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా