తెలంగాణ

telangana

ETV Bharat / state

వారం రోజుల్లో కొవిడ్ చికిత్సా కేంద్రం ఏర్పాటు: సబితా ఇంద్రారెడ్డి - Corona news

జల్ పల్లి మున్సిపాలిటీ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

sabitha
sabitha

By

Published : Apr 28, 2021, 5:56 PM IST

జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల్లో 30 పడకల కొవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కౌన్సిలర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో కరోనా నివారణ, జాగ్రత్తలు తదితర అంశాలపై సమావేశమయ్యారు.
కొవిడ్ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాద కరంగా ఉందని… ప్రజలంతా జాగ్రత్త వహించాలని సూచించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details