కొవిడ్-19 మహమ్మారి తీవ్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ సహా పరిసరాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నేటి నుంచి పరీక్షలను ప్రారంభించింది. ఈ క్రమంలో వనస్థలిపురం, కొండాపూర్, సరూర్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఈరోజు నుంచి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. బాలాపూర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనూ నమూనాలను సేకరిస్తున్నారు.
జీహెచ్ఎంసీలో కరోనా పరీక్షలు ప్రారంభం... ఆ ప్రాంతాల్లో ఉచితం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహా పరిసరాల్లో 50 వేల కొవిడ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి పరీక్షలను ప్రారంభించింది.
ప్రారంభమైన కొవిడ్ పరీక్షలు.. ఆ ప్రాంతాల్లో ఉచితం..
గతంలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారిని కాంటాక్టయిన వారికి మొదట పరీక్షలు చేయనున్నట్లు రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఆయా ఏరియాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో.. పరీక్షలు చేయనున్నట్లు వివరించారు.