కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రేపటి నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేయనున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం చేశారు.
రేపే టీకా: వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం - rangareddy district corona vaccine news
ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. కరోనాను అంతమొందించే టీకా వ్యాక్సినేషన్ రేపే ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాల్లో కొవిడ్ నియంత్రణ టీకాకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

'ప్రజలు ఎదురుచూస్తోన్న సమయం వచ్చింది'
ఆమనగల్, హఫీజ్‌పేట, ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌తోపాటు మైలార్ దేవరంపల్లి, మొయినాబాద్, నార్సింగి, షాద్ నగర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ మూడు కేంద్రాల్లో టీకా పంపిణీ జరుగనుంది. వికారాబాద్‌లో సివిల్ ఆస్పత్రి, పరిగిలో ఏరియా ఆస్పత్రి, తాండూరు జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్ వేయనున్నారు.
ఇదీ చూడండి :'వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. కానీ వారికి ఇవ్వట్లేదు'