రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్ర సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు దుర్మరణం చెందారు. ఫారూఖ్ నగర్‌కు చెందిన అంజయ్య (40), కళమ్మ (34) దంపతులు ద్విచక్ర వాహనంపై కొత్తూరు నుంచి షాద్‌నగర్ వైపు జాతీయ రహదారి మీదుగా వస్తుండగా కొత్తూరు సమీపంలో వాహనం అదుపు తప్పి కిందపడి పోయారు.
విషాదం: రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం - దంపతుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: సున్నం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం