హైదరాబాద్ కార్పొరేషన్ మన్సూరాబాద్ డివిజన్ త్యాగరాయనగర్ రహదార్లకు మోక్షం లభించింది . మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రహదారి పనులకు భూమి పూజ చేశారు. త్యాగరాయనగర్ మెయిన్ రోడ్డు, అపార్ట్‌మెంట్స్ వీధి రోడ్డుకు కలిపి రూ. 75లక్షల విలువైన పనులు ప్రారంభించారు .
మన్సూరాబాద్ డివిజన్‌లో రహదార్లకు శంకుస్థాపన చేసిన కొప్పుల నరసింహారెడ్డి - started development work
ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్‌లో రహదార్లకు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి వెంట దశాబ్దకాలమే కాలనీలు ఏర్పడినా స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి సారించ లేదు. ఎట్టకేలకు స్థానిక కార్పొరేటర్ అధికారులను ఒప్పించి త్యాగరాయ నగర్, బాలాజీ నగర్, ఆదిత్య నగర్‌లలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు.
ఒకనెల రోజుల లోపేఈ రహదారి పనులు పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామన్నారు . ఎన్నికల సమయయంలో త్యాగరాయనగర్,బాలాజీనగర్, ఆదిత్యా నగర్ కాలనీలు దత్త తీసుకుని పనులు చేస్తానన్న హామీ 80శాతం పూర్తి చేశానని కార్పొరేటర్ నరసింహారెడ్డి చెప్పారు. మిగిలిన పనులు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు . దశాబ్ద కాలంగా రహదార్లు, డ్రైనేజీ లేక ఈ కాలనీలు ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డ్రైనేజీల నిర్వహణలో కాలనీ వాసులు సహకరించాలన్నారు . చెత్త వేయవద్దని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాలనీ వాసులకు కార్పొరేటర్ నరసింహారెడ్డి సూచించారు.
ప్రజల ఇబ్బందులు గుర్తించి కార్పొరేషన్ అధికారులను ఒప్పించి నిధులు విడుదల చేయించిన కార్పొరేటర్‌ను స్థానికులు శాలువాతో సత్కరించారు .