ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు నుంచి సూపర్ స్ప్రెడర్ల(super spreaders)కు వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం హుడా కమ్యూనిటీ హాల్లో ఈ రోజు సుమారు 1000 మందికి వ్యాక్సిన్(corona vaccination) వేయటానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రక్రియను డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Corona vaccination: టీకా కేంద్రాలకు క్యూ కట్టిన సూపర్ స్ప్రెడర్లు - corona vaccination to super spreaders in vanasthalipuram huda community hall
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం హుడా కమ్యూనిటీ హాల్లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకాలు
మొత్తం పది కౌంటర్ల వద్ద వాహకులకు టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేసిన అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచిన అనంతరం ఇంటికి పంపిస్తున్నారు.
ఇదీ చదవండి:Revenge: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..