రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి ఆరోగ్యం సరిగా లేదని రెండు రోజుల క్రితం కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేయడం వల్ల కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మొయినాబాద్ మండలంలో నలుగురికి కరోనా - రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కరోనా వార్తలు
కరోనా కేసులు హైదరాబాద్ పరిధిలో క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పలు ప్రాంతాలకు వ్యాపించిన కొవిడ్ వైరస్.. తాజాగా మొయినాబాద్ మండలంలో మరో నలుగురిలో బయటపడింది.

మొయినాబాద్ మండలంలో నలుగురికి కరోనా
అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అతని నుంచి పెద్ద కొడుకు, కుమార్తె, మనవరాలకు కరోనా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి :ఆదివారం పదిగంటల పది నిమిషాలకు ఎంపీ నామ ఏం చేశారంటే...