రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ రైతు సహకార సంఘం బ్యాంకులకు రైతులు, ఖాతాదారులు అత్యవసరమైతే తప్ప బ్యాంకుకు రావొద్దని జిల్లా సహకార సంఘ బ్యాంకు వైస్ ఛైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య స్పష్టం చేశారు. తుర్కయంజాల్, బీఎన్ రెడ్డి నగర్, కోహెడ పరిధిలో ఉన్న తమ బ్యాంకు బ్రాంచీలకు ఆన్లైన్ సేవలు లేనందున రైతులు, ఖాతాదారులు గుంపులుగా రావొద్దని సూచించారు. ఇప్పటికే బ్యాంకుల్లోని సిబ్బందిని తగ్గించామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'బ్యాంకులకు అత్యవసరం అయితేనే రండి' - తుర్కయంజాల్ రైతు సహకార సంఘం బ్యాంకుల వార్తలు
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ రైతు సహకార సంఘం బ్యాంకులకు ఖాతాదారులు, రైతులు రావొద్దని బ్యాంకు వైస్ ఛైర్మన్ కె. సత్తయ్య స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే రావాలని సూచించారు.
'అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి'