తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతపై కరోనా ప్రభావం

కరోనా వైరస్ పరోక్షంగా అన్నదాతల కడుపుమీద కొడుతోంది. ఆశించిన మేర దిగుబడి సాధించినా... అమ్మకానికి అవకాశాలు లేక కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాల్లో కూరగాయలు పొలాల్లోనే కుళ్లిపోయే స్థితికి వచ్చాయి.

corona effect on farmers
అన్నదాతపై కరోనా ప్రభావం

By

Published : Apr 4, 2020, 10:16 AM IST

కరోనా వైరస్ పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని కూరగాయ రైతులపై పరోక్షంగా పెను ప్రభావం చూపుతోంది. క్యారెట్, బీట్​రూట్ పంటలు పొలాల్లోనే కుళ్లిపోతున్నాయి. లాక్​డౌన్​ కారణంగా మార్కెట్​కు తీసుకెళ్లే మార్గం లేక ఒక్కో రైతుకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. వ్యయప్రయాసల కోర్చి మార్కెట్లకు తీసుకెళ్లినా గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వేదనే మిగులుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో క్యారెట్ సాగుచేస్తోన్న రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్

అన్నదాతపై కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details