మీర్‌పేట పరిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా - meerpet corona cases latest news
11:02 June 27
మీర్‌పేట పరిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
హైదరాబాద్ మీర్‌పేట పరిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు వెల్లడించారు. భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో 774 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా పలు చోట్ల ప్రజలు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి :దారుణం: రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త