తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు శ్రేయస్సు కోసమే నియంత్రిత సాగు విధానం' - MLA manchireddy kishanreddy latest news

రాష్ట్రంలోని రైతులు అప్పులు చేయడం కాకుండా అప్పులు ఇచ్చే దిశగా వారు ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని రూపొందించిందని తెలిపారు.

Rangareddy district latest news
Rangareddy district latest news

By

Published : May 26, 2020, 6:21 PM IST

Updated : May 26, 2020, 7:00 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలన్ గ్రామంలోని రైతులకు వానాకాలం పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి హాజరయ్యారు.

భూసార పరీక్షలు చేసుకున్న తరువాతే పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులకు సూచించారు.​ పంటలకు తప్పకుండా బీమా చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటింటి అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ నూతన పంటల సాగు విధానమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి తెలిపారు.

Last Updated : May 26, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details