Congress strike to cancel Dharani portal: ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధరణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ధరణి పోర్టల్ దళితులకు, పేదలకు శాపంగా మారిందని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచిపెడితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో బలవంతంగా ఆ భూములను బలవంతంగా వెనక్కి లాక్కోవడం జరుగుతోందని ఆయన తెలిపారు. కొన్ని భూములను ధరణిలో చేర్చకుండా వేధింపులకు గురి చేయడం సరికాదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి వ్యక్తి ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పాసు పుస్తకాల పేరుతో ఉన్న భూమిని లాగేసుకునేందుకు చేసే ప్రయత్నమే ధరణి అని ఎద్దేవా చేశారు.