తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగుచట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే: రేవంత్‌ రెడ్డి - revanth reddy demands farms acts tobe back

రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్‌ రైతు రణభేరి సభలో పాల్గొన్నారు.

revanth
సాగుచట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే: రేవంత్‌ రెడ్డి

By

Published : Feb 16, 2021, 10:53 PM IST

నూతన సాగుచట్టాలతో.. కేంద్ర ప్రభుత్వం రైతులను కూలీలను చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ అందుకు మద్దతు పలుకుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. అచ్చంపేటలో చేపట్టిన రేవంత్‌ రైతు భరోసా యాత్ర.. రంగారెడ్డి జిల్లా రావిరాలలో ముగిసింది.

149 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం రేవంత్‌.. రావిరాలలో రాజీవ్‌ రైతు రణభేరి సభలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

సాగుచట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే: రేవంత్‌ రెడ్డి

ఇవీచూడండి:ఉదండాపూర్ జలాశయ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: భట్టి

ABOUT THE AUTHOR

...view details