తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్, 111 జీవో ఎత్తివేయాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా - rangareddy news

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎల్​ఆర్​ఎస్, 111 జీవో ఎత్తివేయాలని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేను అడిగితే తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

Congress leaders dharna to lift LRS, 111 Jivo
ఎల్​ఆర్​ఎస్, 111 జీవో ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా

By

Published : Dec 23, 2020, 6:23 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎల్​ఆర్​ఎస్, 111 జీవో ఎత్తివేయాలని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. 111 జీవో ఎత్తి వేస్తామని స్వయంగా రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యను అడిగితే తమపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కి తరలించారు. ఈ కార్యక్రమంలో 84 గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతులతో మాట్లాడిన మమత- సరిహద్దుకు ఐదుగురు ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details