తెలంగాణ

telangana

ETV Bharat / state

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​ - shamshabad murder case

శంషాబాద్​లో పశువైద్యురాలి కుటుంబసభ్యలను కాంగ్రెస్​ సీనియర్​ వీహెచ్​ పరామర్శించారు. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leader vh spoke on shamshabad incident
నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

By

Published : Dec 1, 2019, 7:36 PM IST

ప్రస్తుతం ఉన్న చట్టాలు అత్యాచార బాధితులకు పనిచేయవని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులపై నమ్మకం లేదని... అక్కడ బాధితులకు న్యాయం జరగదని ఆరోపించారు. నిర్భయచట్టం పనికిరాదని... ఈ రోజుల్లో ఇంకా పటిష్టమైన చట్టం తేవాలని వీహెచ్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలి నివాసానికి వచ్చిన వీహెచ్... ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ అన్యాయం జరిగిందని వీహెచ్ తెలిపారు. హోంమంత్రి మాటలు కూడా సరికాదన్నారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగానే టోల్‌గేట్‌ వద్దకు పోలీసులు వెళితే న్యాయం జరిగేదన్నారు. ట్విట్టర్‌లో సానుభూతి సందేశాలు పంపడం కాదని బాధితులతో మాట్లాడాలని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

ABOUT THE AUTHOR

...view details