రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వివరించారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 'విద్యార్థి- నిరుద్యోగ సైరన్' పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని స్పష్టం చేశారు.
Addanki Dayakar: 'ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన'
అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు 'విద్యార్థి- నిరుద్యోగ సైరన్' పేరిట కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడనుందన్నారు. అందులో భాగంగా దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ నుంచి ర్యాలీగా ఎల్బీనగర్ రింగ్ రోడ్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్టోబర్ 2న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్‌ను విజయవంతం చేయాలని దయాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెల్యా నాయక్, మల్రెడ్డి రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీచూడండి:Manikonda Manhole Incident: రజినీకాంత్ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం.. బాధ్యులపై చర్యలు