రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆరోపించారు. రైతులకు వ్యవసాయ రంగ పరికరాలు ఇవ్వకపోగా డ్రిప్ తదితర పరికరాలు మీద జీఎస్టీ విధించడం సరి కాదని తెలిపారు.
'రైతు సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం' - congress leaders fire on cm kcr
రాష్ట్ర ప్రభుత్వం పండించమని చెప్పిన పంటలకే రైతు బీమా ఇస్తామని... ఇతర పంటలకు ఇవ్వమని స్వయంగా ముఖ్యమంత్రి అనటం రైతులను బెదిరించటమేనని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రైతు సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం'
ఓ పక్క కరోనా మహమ్మారి... మరోపక్క కూలీల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పండించమని చెప్పిన పంటలకే రైతు బీమా ఇస్తామని... ఇతర పంటలకు ఇవ్వమని స్వయంగా ముఖ్యమంత్రి అనటం రైతులను బెదిరించటమేనని కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.