తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిభట్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ - కొత్త హార్థికకు నోటీసులు

ఆదిభట్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త హార్థిక విప్ ఉల్లంఘించారని కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, రంగారెడ్డి కలెక్టర్‌, ఆదిభట్ల కమిషనర్, కొత్త హార్థికకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.

adibatla municipal elections
adibatla municipal elections

By

Published : Feb 11, 2020, 11:09 PM IST

ఆదిభట్ల మున్సిపల్ ఛైర్​పర్సన్ కొత్త హార్థిక ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ విప్​ను ధిక్కరించినందున... కౌన్సిలర్​గా ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషన్​లో కాంగ్రెస్ కౌన్సిలర్లు జి.బాలరాజ్ గౌడ్, మర్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఆదిభట్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో... కొత్త హార్థిక సహా ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారని పేర్కొన్నారు.

విప్ ఉల్లంఘన

ఛైర్​పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మర్రి నిరంజన్ రెడ్డికి ఓటేయాలని జారీ చేసిన విప్​ను కొత్త హార్థిక ఉల్లంఘించి తన ఓటు తనకే వేసుకున్నారన్నారు. ఆమెపై అనర్హత విధించాలని తమ ఫిర్యాదుపై మున్సిపల్ ఎన్నికల అధికారి స్పందిస్తూ.. విప్ చట్ట ప్రకారం చెల్లదని పేర్కొన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అధికారి ఉత్తర్వులను రద్దు చేసి.. కొత్త హార్థికపై అనర్హత వేటు వేయాలని పిటిషన్​లో కోరారు.

హైకోర్టు నోటీసులు

పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్​తో పాటు.. హార్థికకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:చివరి నిమిషంలో ఆదిభట్ల పురపాలిక తెరాస కైవసం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details