రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం ముందుకు కాంగ్రెస్, భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. ఛైర్పర్సన్ కప్పరి స్రవంతి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం నుంచి కాంగ్రెస్, భాజపా నేతలు వాకౌట్ చేశారు. మున్సిపాలిటీలో దాదాపు రూ. 3 కోట్ల నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ... ధర్నా చేశారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయల నిధులు ఎలాంటి ఏజెండా, తీర్మానాలు లేకుండా కేటాయించారని ఆరోపించారు.
'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు' - ibrahimpatnam muncipal council meeting updates
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. దాదాపు రూ.3 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ... కాంగ్రెస్, భాజపా నేతలు ఆందోళనకు దిగారు.
'రూ. 3 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు'
ఒకే పనికి అనేక సార్లు బిల్లులు ఇచ్చారని... నిధులు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఛైర్మన్‌ను ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
TAGGED:
rangareddy latest news