జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారంటూ రాష్ట్ర ప్రైవేట్ అధ్యాపక ఉద్యోగుల సంఘం నాయకులు జేఎన్టీయూహెచ్లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ యాజమాన్యంపై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వల్ల యాజమాన్యాలు ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు.
'జీతం అడిగితే ఉద్యోగం తీసేస్తున్నారంటూ ఫిర్యాదు' - బాటసింగారంలోని ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు
ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతాల్లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జీతాలు అడిగినవారిని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలపై ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
'జీతం అడిగితే ఉద్యోగం తీసేస్తున్నారంటూ ఫిర్యాదు'
రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 45ని కళాశాల యాజమాన్యాలు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర అధ్యక్షులు సంతోశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీటీయూ మార్గదర్శకాల ప్రకారం జీతాలు చెల్లించడం లేదన్నారు. అధ్యాపకులకు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్‌ను కోరామని...అందుకు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం