రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయంజాల్ భూములను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతితో పాటు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధీనంలో ఉన్న భూముల్లోని గోదాంలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను పరిశీలించారు.
దేవరయంజాల్ భూములను పరిశీలించిన అధికారులు - devarayanjal land issue
రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని దేవరయంజాల్ గ్రామంలోని భూములను అధికారులు సందర్శించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధీనంలో ఉన్న భూముల్లోని గోదాంలను పరిశీలించారు.
దేవరయంజాల్ భూములు, దేవరయంజాల్ భూ వివాదం, ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు, దేవరంయజాల్ భూములు పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి
మరోవైపు.. జమున హేచరీస్ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వేలు చేసి బోర్డులు పెట్టారని మాజీ మంత్రి ఈటల సతీమణి, కుమారుడు నితిన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెందిన భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్ డీజీ, మెదక్ కలెక్టర్‌ను ఆదేశించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండితెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది : ఈటల