కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులు, వైద్యులపై ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామాన్ని ఆయన సందర్శించారు. క్వారంటైన్ నుంచి తిరిగి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. కొంతకాలం గృహ నిర్బంధంలోనే ఉండాలని సూచించారు. గ్రామంలో వైద్య సేవల ఏర్పాటు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
చేగూరును సందర్శించిన కలెక్టర్ - చేగూరును సందర్శించిన కలెక్టర్ అమోయ్ కుమార్
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్ సందర్శించారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులు, వైద్యులపై ఉందని కలెక్టర్ అన్నారు.
చేగూరును సందర్శించిన కలెక్టర్