CM KCR On Rythu Bandhu Funds Release Issue : రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు పచ్చి అబద్ధాలు చెబుతారని.. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్ర, దృక్పథం చూడాలని పేర్కొన్నారు. ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణను.. ఆంధ్రాలో కలపటం వల్ల 50 ఏళ్లు ఎన్నో గోసలు పడ్డామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు - తెలంగాణలో మాత్రం నీటి పన్ను లేదు : కేసీఆర్
KCR Fires on Congress : 'గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదు. నేను ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఏమీ ఉండలేదు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి.. రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారని' కేసీఆర్ ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి : కేసీఆర్
KCR at Shadnagar BRS Praja Ashirwada Sabha :పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉందో గమనించాలని ప్రజలకు కేసీఆర్‌సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన‌్యం కొంటున్నామని పేర్కొన్నారు. రైతుబంధు అనే మాట పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రైతుబంధును ఈసీ మళ్లీ ఆపేసింది
"రైతుబంధు ఇచ్చి ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. రైతుబంధు ఉంచడమే కాదు.. రూ.16,000కు పెంచుతాం. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. 3 గంటలు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మేం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయి. రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరు. ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధరణి తీసేసి భూమాత తెస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా?." - కేసీఆర్, ముఖ్యమంత్రి
KCR Election Campaign in Telangana :'కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులో అధికారులు వాటా అడుగుతారు. బీఆర్ఎస్ గెలిస్తే.. అసైన్డ్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని' కేసీఆర్ హామీ ఇచ్చారు.
10 ఏళ్ల బీఆర్ఎస్, 50 ఏళ్ల కాంగ్రెస్ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్
Telangana Assembly Elections 2023 : రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు గత నెలలో ఫిర్యాదు చేశారని కేసీఆర్ తెలిపారు. తాను విజ్ఞప్తి చేస్తే.. ఈనెల 28న రైతుబంధు ఇచ్చేందుకు సీఈసీ ఒప్పుకుందని అన్నారు. హస్తం పార్టీ నాయకులు మరోసారి ఫిర్యాదు చేస్తే.. రైతుబంధును కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆపేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. షాద్‌నగర్ వరకు మెట్రో రైలు, మెడికల్ కళాశాల నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని పదేళ్ల పాలనలో పోగొట్టాం : కేసీఆర్
నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే - నాకు పదవులు లెక్క కాదు : కేసీఆర్