తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగా 4 జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

CM KCR inagurates new Collectorates నిర్మాణాలు పూర్తైన సమీకృత కలెక్టరేట్లను ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారైంది. రాబోయే 20 రోజుల్లో రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం షెడ్యూల్ సిద్ధం కావడంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

CM KCR
CM KCR

By

Published : Aug 21, 2022, 5:15 PM IST

CM KCR inagurates new Collectorates: నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నూతనంగా నిర్మించిన రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదేవిధంగా 29వ తేదీన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి.

జిల్లాల విభజన తరువాత అన్ని చోట్ల సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా చాలా వరకు నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం కేసీఆర్ మల్కాజ్ గిరి, వికారాబాద్ కలెక్టరేట్లను ప్రారంభించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details