AP CM Jagan on Samatamurthy :సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని ముచ్చింతల్లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి జగన్ అభినందనలు తెలిపారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
"అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషిచేశారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి అభినందనలు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలి. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది."
- జగన్, ఏపీ ముఖ్యమంత్రి
సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన ఏపీ సీఎం జగన్.. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త జూపల్లి రామేశ్వరావు జగన్కు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. అనంతరం సీఎం జగన్ సమతామూర్తిని దర్శించుకున్నారు.