రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ సిరినగర్ కాలనీలో రోజువారీ కూలీలకు కాంగ్రెస్ శ్రేణులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరంలోని పార్టీ శ్రేణుల సహకారంతో 75 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ - భట్టి విక్రమార్క పుట్టినరోజున నిత్యావసరాల పంపిణీ
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ సిరినగర్ కాలనీకి చెందిన రోజువారీ కూలీలకు చేయూత అందించారు.

భట్టి విక్రమార్క పుట్టినరోజున నిత్యావసరాల పంపిణీ
కాంగ్రెస్ నేతలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి నిత్యావసర సరకులు, బియ్యం, గోధుమ పిండి, వంటనూనె, కందిపప్పును పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత ధనరాజ్ గౌడ్, తల్లాటి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.