రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని బంజారా కాలనీ రెండు రోజులుగా నీట మునగడం వల్ల పరిశీలించేందుకు జలమండలి ఎండీ దానకిషోర్ వచ్చారు. అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న స్థానిక భాజపా నాయకులు దానకిషోర్ దగ్గరకు వచ్చి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను వినిపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న స్థానిక తెరాస కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి భాజపా నాయకులను పక్కకు తోసేశారు.
తెరాస, భాజపా వర్గాల మధ్య ఘర్షణ - jalamandali md danakishore
హయత్నగర్ పరిధిలోని బంజారా కాలనీలో తెరాస, భాజపా నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వరదలను పరిశీలించడానికి వచ్చిన జలమండలి ఎండీ దానకిషోర్ వాహనాన్ని అడ్డుకునే క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది.
తెరాస, భాజపా వర్గాలకు మధ్య ఘర్షణ
అక్కడి నుంచి తిరిగి వెళుతున్న దానకిషోర్ వాహనాన్ని అడ్డుకునే క్రమంలోనే తెరాస, భాజపా నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చూడండి: తెరాసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ఉత్తమ్