Clash Between BRS and Congress Leaders in Ibrahimpatnam : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నువ్వా-నేనా అనే రీతిలో తలపడుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్(BRS Vs Congress) అభ్యర్థులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకే రోజు నామినేషన్(Telangana Election Namination) కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలే హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఇద్దరూ ఒకే రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉదయం సమయం కేటాయించగా.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మధ్యాహ్నం 2గంటలకు సమయం కేటాయించారు.
నేతల నామినేషన్ కోసం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి ఉదయమే ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసి.. కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఇదే సమయంలో నామినేషన్ వేసేందుకు పట్టణంలో నుంచి మల్‌రెడ్డి ర్యాలీ ప్రారంభించగా.. బస్ డిపో వద్ద ఇరువర్గాలు తారసపడ్డాయి.
Manchireddy Kishanreddy Vs Malreddy Rangareddy : రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు.. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి ప్రారంభం కాగా.. పెద్దఎత్తున దాడులు(BRS and Congress Clash War) చేసుకున్నారు. ఈ గొడవలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు, మధ్యలో ఉన్న పోలీసులకు గాయాలయ్యాయి. అక్కడున్న కొన్ని వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో లాఠీలకు పనిజెప్పిన పోలీసులు.. 2 వర్గాలను చెదరగొట్టారు.
పరిస్థితి సమీక్షించిన సీపీ చౌహాన్ : ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెంటనే అక్కడి వెళ్లారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన పరిస్థితి చేయిదాటకుండా పర్యవేక్షించారు. నామినేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఈ ఘర్షణ జరిగిందని సీపీ చౌహాన్ తెలిపారు.