Civil Supply on Rice Grain: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 6,832 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ధాన్యం దిగుబడికి అనుగుణంగా 30 జిల్లాల్లో 5,299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పౌరసరఫరాలశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ రోజు వరకు 76,495 మంది రైతుల నుంచి రూ. 1,483 కోట్ల విలువైన 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించింది.
ఇందులో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించామని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోళ్ల కోసం 8.36 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.