రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.
శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట
08:32 May 16
చిరుతను పట్టుకునేందుకు ఉరుకులు పరుగులు
ఇవాళ ఉదయం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య చేపలు పట్టేందుకు హిమాయత్ సాగర్‌కు వెళ్లగా అక్కడ చిరుత కనిపించింది. కిష్టయ్య వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. కిష్టయ్యను వెంటబెట్టుకొని చిరుత కనిపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కాలి గుర్తుల ఆధారంగా శంషాబాద్ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
48 గంటలు దాటుతున్న చిరత దొరక్కపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై లారీ డ్రైవర్‌పై దాడి చేసినప్పటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇవీ చూడండి: రహదారులు రక్తసిక్తం.. ముగ్గురి దుర్మరణం..